vinod

jokes by ramanjineyulu.

Picture
వంశ పారంపర్యం
“వెంకయ్యగారూ… ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్
చేస్తే పోతుంది” చెప్పాడు డాక్టర్.
“అమ్మయ్య… బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి” చెప్పాడు వెంకయ్య.

ఏ పక్క
“మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ
పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?” సుధాకర్‍ను అడిగాడు
కరుణాకర్.

“గోడపక్క” చెప్పాడు సుధాకర్

భయం
“నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో
మూసి ఉంచుతాను”

“ఏం…. మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?”

“కాదు….. నన్ను తోసేస్తుందని.”

కోరిక
“నాన్నా… నాన్నా… నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి
ఒక సన్నాయి కొనిపెట్టవా?” ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

“వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది” అన్నాడు తండ్రి.

“ఫర్లేదు నాన్నా… మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను” చెప్పాడు
కొడుకు అమాయకంగా.

పట్టుదల
“పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్” అన్నాడు నరసింహం

“అలాగా…. అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి
గ్లాసులో నింపండి చూద్దాం” ఎదురన్నాడు కుర్రాడు.

రుసరుసలు
“ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?” శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
“ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే…….

ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది” కోపంగా అంది శ్యామలమ్మ.

చిరుత … ఆ తరువాత
ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా – చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత – బాలకృష్ణ తనయ

ఉడత – వెంకటేష్ తనయ

మిడత – మోహన్ బాబు తనయ

పిచుక – పవన్ కళ్యాణ్ తనయ
……..

death certificate
“మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension
ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

“ఓ.. అలాగా… దానికేం భాగ్యం…. ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
“ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ… ఆయనంతట ఆయనే పోయారు….”

నిద్ర పోయేముందు
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి “ఇందులో
రాసిన మందు సీసాలు రెండివ్వండి” అని అడిగాడు వాసు.

“రెండెందుకండీ?” అమాయకంగా అడిగాడు షాపువాడు.
“ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..”

చెక్కు
“రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు” అన్నాడు డాక్టర్ సుందర్.
“ఎందుకండీ?” అన్నాడు చంద్రం.
“ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట” అన్నాడు డాక్టర్.
“మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది” బదులిచ్చాడు చంద్రం.

బాక్సింగ్
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.

“ఊ కొట్టు… కొట్టు…. దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి” అని ప్రేక్షకుల్లోంచి
అరుస్తున్నాడో వ్యక్తి.
“మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?” అడిగాడు పక్కనున్న వ్యక్తి.
“కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని” చెప్పాడు దంతనాధం

తొందరగా
డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

“మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను.
ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా
వీలునామాలో మార్పులు చేస్తా” చెప్పాడు గోపాల్.

“డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను
కొద్దిగా మార్పులు చేస్తా” అన్నాడు డాక్టర్ ప్రకాశ్.

జర్మనీ
టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ…” పాఠం చెబుతోంది టీచర్.

“నాకు తెలుసు టీచర్” చెప్పాడు బంటీ

“ఏమంటారు”

“జెర్మ్స్” జవాబిచ్చాడు బంటీ

న్యూటన్ – బెల్టు
9″న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం
బతికిపోయాం కదమ్మా” స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

“అదేంట్రా? ” అడిగింది తల్లి.

“నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు
కొంటారు” వివరించాడు బంటీ.

నెహ్రూ గారి మాటలు
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ
మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి
తెలుసుకుంటున్నారు.

“నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా” అన్నడు రమణ.

“నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా” చెప్పాడు గోవింద్

“నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు
మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు ” అంది దీప.

“మరి నువ్వో?” మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి

“నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా” దీపకేసి
ఓరగా చూస్తూ చెప్పాడు హరి.

జస్టిస్
“ఏమ్మా…. నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయివి కదూ?!”

“కాదండీ…. జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయిని”

“మరేం ఫర్వాలేదమ్మా… రామారావైతే నేంటి నాగేశ్వరరావు అయితేనేంటి, ఇద్దరు
చేసింది జస్టిసే కదా!?”

సాంప్రదాయం
అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

“చూడమ్మా… ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు
తిను” చివరి జాగ్రత్తగా చెప్పింది.

“ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా
మమ్మీ” అన్నది ఆధునికతరం యువతి.

ప్రేమ
“రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి
వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు
విప్పి నాకు స్వెటర్ వేస్తుంది…” చెబుతున్నాడు చింతామణి.

“అబ్బా… మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట” నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.

“మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా” – అసలు విషయం చెప్పాడు చింతామణి

నమ్మకం
డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి.

లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే “దయచేసి పేల్చడమో, కోయడమో
చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు” అని
రాసుండటంతో ఆ పని చేశాడు.

వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు
దొరికిపోయాడు.

వ్యాన్‍లో తీసుకెళ్తుంటే “హు…. ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం
చేయడం మామూలైపోయింది” అనుకున్నాడు విచారంగా.

బలి
“ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని
పట్రండి. పలావ్ చేసుకుందాం” చెప్పింది సుగుణ.

“ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?” పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది
ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం
night watchmanను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* మరి watchmanku ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి
విధానాలు ఖరారు చేసేందుకు ఒక committe ని వేశారు

* ఇక watchman తన duty సరిగ్గా నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని
ఒక superviserని వేశారు.

* మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ accountant మరియు time
keeperనూ పెట్టారు.

* ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ officerని వేశారు.

* ఆ officerకి ఒక personal secretary, ఒక boy……

* ……..

తీరా చూసేసరికి budget విపరీతంగా పెరిగి పోయింది. ఉద్యాగాల్లో కోత
విధించాలన్న ఉత్తర్వుల మేరకు watchmanను తొలగించారు.

పాతది
“అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది”
ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.

“హమ్మయ్య… బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపది చచ్చాను” నిట్టూరుస్తూ
అన్నాడు పాపారావు.

పిట్ట సాయం
రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే
గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది.

దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు. ఒడుపుగా దాన్ని పట్టేసి
ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు
తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.

తన దగ్గరున్న విస్కీని కాస్తంత దానికి పట్టించాడు. దాంతో తన గిల్టీ
ఫీలింగ్ తొలగిపోగా తాపీగా చేపలు పట్టేందుకు ఉపక్రమించాడు.

కాసేపాగాక ఎవరో వెనక పొడుస్తున్నట్లు అనిపించింది. వెనక్కి చూస్తే అదే పిట్ట….

ముక్కున మరో మూడు ఎరలతో!!!!

ఉచితం
“డాక్టర్ గారూ… నెను చాలా పేద వాడినండీ…. మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను.
ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ… కానీ జీవితాంతం నేను పైసా
పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను” వినయంగా అన్నాడా
వ్యక్తి.

“సరే… ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?” అడిగాడు డాక్టర్.

“కాటికాపరినండీ… శవాలు తగలబెడుతుంటాను” అన్నాడతను.

ఏదో ఒకటి
ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది
“ఏం చేస్తున్నావురా?” అడిగాడు నాన్న.
“నీ బొమ్మ వేస్తున్నాను నాన్న”
“అబ్బ గుడ్”

కాసేపటికి…

“బొమ్మ బాగా రావట్లేదు నాన్న” చెప్పింది వాసవి.
“సరేలే. వదిలేయ్”
“పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?”

కరువు
“ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ?” ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్.

“అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం
లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం
కట్టుకోండి బాబయ్య” బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు

ఫలితం
భార్యను ఆశ్చర్యపరుద్దామని ఆమె పుట్టింటికి వెళ్ళి వచ్చేలోగా ఓ చీరకు
ఫాలు కుట్టాడు సంతోష్.

భార్య ఎంతో సంతషించింది. గాఢంగా ముద్దు పెట్టింది.

“ఇవి కూడా కాస్త కుట్టి పెడతారా? మీకు టైమున్నప్పుడే” మరో రెండు చీరలు
భర్తకిస్తూ అందామె.

సీరియల్
“ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్సేమైనా చూస్తున్నావా వదినా?”

“అబ్బే… ఈ సీరియల్స్‌తో విసుగెత్తిపోయింది. వాస్తవ జీవితమే ఎంతో హాయిగా ఉంది”

“వాస్తవ జీవితమా? ఎప్పుడు మొదలైంది? ఏ ఛానల్లో వస్తున్నది? ఎన్ని గంటలకొస్తున్నది?”

సులభం
“మీ ఆవిడ అలా అప్పులమీదాప్పులు చేస్తూ సామాన్లు కొంటూంటే నా ముందుఏడ్చే
బదులు ఆమెకే సర్ది చెప్పవచ్చు కదా?” అన్నాడు నరసింహం.

“ఆమెకు సర్ది చెప్పేకంటే అప్పులవాళ్ళకు సర్ది చెప్పటం సులభం రా నరసింహం”
దిగులుగా అన్నాడు గోవిందం.

మగాడు
“నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు”
కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.

“ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?” అన్నది భార్య.

“నాకేం? నేను మగాణ్ణి”

“మరి ఆయన మాత్రం మగాడు కాదూ?” అన్నది భార్య.

లింగం మావ – మూత్ర పరీక్ష
కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.

డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన
వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు

“ఎందుకేడుస్తున్నావు ” పలకరించాడు లింగం మావ.
“Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు”
“అయితే”
“రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది”
అంతే…. ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం మావ…

ఆసుపత్రిలో…

“ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి” అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.

Doctor చక చక మందులు రాసిచ్చాడు.

Patient వెళ్ళిపోగానే-

“అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి
చూడకుండానే prescription రాశారు?” అడిగాడు junior doctor.

“అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని
చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు నచ్చదు” నవ్వుతూ
చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి

లింగం మావ – సినిమా ticket
లింగం మావ సినిమాకెళ్లాడు. Tickets కోసం క్యూలో నిల్చున్నాడు.
అతని ముందున్న వ్యక్తి టెకెట్లు తీసుకుంటున్నాడు.
“Golden circle tickets అయిపోయాయి. Diamond circle మాత్రమే ఉన్నాయి”
చెప్పాడు సినిమా హాల్ వ్యక్తి
“సరే.. diamond circle ఇవ్వండి”

ఆ తర్వాతి వ్యక్తితో….
“మిగతా tickets అన్నీ అయిపోయాయి. Only balcony”
“సరే balconyయే ఇవ్వండి”

ఇప్పుడు లింగం మావ వంతు.
“house full” చెప్పాడు హాల్ వ్యక్తి.
“సరే… house fullలోనే ఇవ్వండి” చెప్పాడు లింగం మావ

నెక్లెస్
“మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు”
సాధింపుగా అన్నది రాణి.

“అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా” పెదవులు చప్పరిస్తూ
అన్నడు భర్త.

వాగ్దానం
“ఏమండీ… మొన్న ఎన్నికల్లో గెలిస్తే నాకు పదివేల రూపాయల పట్టుచీర
కొనిపెడతామన్నారు. గెలిచి ఆర్నెల్లు అయినా మళ్లీ ఆ ఊసు ఎత్త లేదు” గోముగా
అన్నది విశాలాక్షి.

“ఓట్లకోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అవన్నీ తీరుస్తురా ఎవరైనా విశాలా?”
అన్నాడా రాజకీయ నాయకుడు.

తొందర
“మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా
తేవాలనుకుంటున్నాను” భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.

“నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు” చెప్పింది భార్య.

లింగం మావా – మజాకా?
మొదటిసారి keyboard చూసి లింగం మావ ఏమనుకున్నాడు?
తారుమారుగా ఉన్న అక్షరాలను సరిచేయాలనుకున్నాడు.

Bus pass ఉన్నా లింగం మావ ticket ఎందుకు కొన్నాడు?
Conductorని April Fool చేద్దామని.

లింగం మావ తల ఎందుకు బొప్పి కట్టింది?
గోడ మీద వాలిన్న దోమలను రాయితో కొడుతుంటే, అతడి స్నేహితుడు బుర్ర
ఉపయోగించమని సలహా ఇచ్చాడు.

స్నేహితుడు అప్పు చెల్లించకపోయినా లింగం మావ ఎందుకు సంతోషంగా ఉన్నాడు?
కొత్త అప్పు అడగనని మాట ఇచ్చాడు కాబట్టి.

Shopping complex ముందు ఆటో ముందటి చక్రం ఎందుకు విప్పాలనుకున్నాడు?
“Two wheeler parking” అని రాసున్నది

అరుపు
“నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?” అడిగింది కూతురు
“అవును బేబీ” సమాధానిమిచ్చాడు తండ్రి.
“మరి వాళ్ళు పోవాలంటే?” అడిగింది కూతురు

“మీ అమ్మ అరవాలి ” అన్నాడు తండ్రి.

ఇద్దరూ దొంగలే
ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట
చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- “బాల్ లేదు
కాబట్టి ఆట క్యాన్సిల్” ఓడిపోయేట్టున్న రాము.

“ఇదిగో దొరికింది” తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
“బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?”

“నిజంరా నాకు దొరికింది”
“ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?”

ఉండను
“అయ్యగారూ… మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు
ఊరికే తిట్టిపోస్తున్నారు” చెప్పాడు నౌకర్.

“అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?” సర్ది చెప్పబోయడు యజమాని.

“నాకేం ఖర్మండీ… ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?” వెళ్తూ
అన్నాడు నౌకర్.

చిన్న-పెద్ద
“మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?”
సందేహంగా అడిగాడు క్లయింటు.

“ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను” అభయమిచ్చాడు లాయర్.

భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. “కొంచెం మా ఆయన్ను
పిలుస్తారా?” అడిగింది ఆపరేటర్ని.

“number please” అడిగింది ఆపరేటర్.

“నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?” కయ్‍మంది ధనలక్ష్మి.

దాచు
“రాధా….రాధా… వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు
రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు” కంగారుగా అన్నాడు కృష్ణ.

“మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?” అయోమయంగా అన్నది రాధ.

“అబ్బా… నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి
సెలవులో ఉన్నాను” విషయం చెప్పాడు కృష్ణ.

Blood circulation
“చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి
వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది” డ్రెస్సులు
చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.

“వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది” ఆశ్చర్యంగా అన్నది కవిత.

“మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది” చెప్పాడు షాపతను.

మందు
రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ
రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక
గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా
రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని
అడిగేశాడు.

“నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో సలిసి తాగేవాడిని.
ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు
గ్లాసులు తాగుతున్నాను” చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు
రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు “ఏంటి సార్ మీ
స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?”

“లేదయ్యా నేను మందు మానేశాను” చెప్పాడు రామారావు.

ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును
హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా
అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో
లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:

* అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
* పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ
అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు
ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు.
కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు
నుంచి బయటకు పోవడం తప్ప.

ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ
విధంగా సూచనలు ఉన్నాయి.

మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.

రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా
చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.

మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా
చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.

అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది
ఆ అమ్మాయి.

నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా
చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి
పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.

“ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు
అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు
ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది”.

అక్కడి సూచన ఇది:

“మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో
పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్ప


when things go wrong...
when sadness fills ur heart...
when tears flow in ur eyes...always remember 3 things
1---GOD
2---ur parents
3---my sincere prayers.....GOD LUCK&God bless u.
With my
1 Heart...
2 eyes...
5 litre blood...
206 bones...
1.2million Red Cells...
60 trillion D.N.A.'s...
I wish u "All the very best of LUCK"..


Each moment of ur life is a picture which u had never seen before. And which ull never see again so enjoy> & live life & make each moment beautiful.... Life gives answer in 3 ways... It says Yes & gives u what u want, it says no and gives u something better, it says wait and gives u the బెస్ట్.
What touches us the most is... Being hurt by some1 U Trust A Lot... .... OR .... Being Trusted by some1 U have Hurt a Lot..
Coincidence decides whom u meet in life,Ur heart decides whom u want to stay in ur life... Destiny decides who will get to stay in ur life..

बी.   नीलाय्या नायक .


 గుడ్‌ఫ్రైడే - చరిత్ర, ప్రాధాన్యత
క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి
ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ
వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య...
ముళ్ళ కంచెల భారంతో... శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో
మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష
పూనుతారు.

గుడ్‌ఫ్రైడ్‌ అనే పదం గ్సాడ్‌ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని
చెబుతారు. ఈ పదం - పది లేదా 11వ శతాబ్దంలో ్థసిరపడినట్లు తెలుస్తోంది.
క్రైస్తవ గ్రంధాల ప్రకారం - ఏసుక్రీస్తు నజరత్‌ అనే పట్టణానికి చెందిన
వ్యక్తి. ఈ పట్టణం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉంది. చాలామంది ఏసును దేవుని
బిడ్డగా భావించేవారు... పూజించేవారు, కొలిచేవారు. అయితే యూదు ప్రవక్తలకు,
ఉన్నతాధికారులకు మాత్రం ఇది కడుపుమంటగా ఉండేది. ప్రజల్ని ఏసు తప్పుదోవ
పట్టిస్తున్నాడని వారు భావించేవారు. దాంతో వారు ఎలాగైనా ఏసును
హతమార్చాలని కుతంత్రం పన్నారు. జుడాలని పిలవబడే 12 మంది శిష్యులతో వారు ఈ
పథకాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నించాడు. వారు ఏసుక్రీస్తును
నిర్భధించారు. ఆ మర్నాడు ప్రవక్తల సంఘం ముందు హాజరుపరిచారు.

ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాడని, చక్రవర్తికి పన్నులు కట్టక్కర్లేదని
ప్రజలకు చెబుతున్నాడని, తాను దేవుని ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడని...
ఇలా వివిధ ఆరోపణల్ని ఏసుపై రుద్దారు. ఇవన్నీ నిజమని నిర్ధారించి రోమన్‌
చక్రవర్తి ముందు ఏసును హాజరు పరిచారు. అయితే చక్రవర్తి మాత్రం ఆ
ఆరోపణల్ని నమ్మలేదు - అయినా మతప్రవక్తలు పట్టుబట్టి - నగరంలోని
విధ్వంసకాండకు కూడా ఏసే కారణమని నమ్మబలికారు. చక్రవర్తిపై వారు మరింత
ఒత్తిడి తీసుకురావడంతో ఇక చేసేది లేక చక్రవర్తి - ఏసును ఏం చేసుకుంటారో
మీ ఇష్టం అని ఆ మతప్రవక్తలకు వదిలి వేశాడు. దీంతోవారు ఏసును శిలువ
వేయాలని నిర్ధారించారు.

ఏసుక్రీస్తుకు తలపై ముళ్ళ కంప పెట్టారు. సైనికులు కొరడాలతో కొట్టారు.
చెక్కతో చేసిన పెద్ద శిలువను ఆయన భుజాలపై మోపారు. కొంతదూరం నడిపించారు.
చుట్టూ ప్రజలు... ఆయన వెనుక ఆయన అనుచరులు... ప్రజలు రాళ్ళతో కొట్టారు.
చివరకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏసుక్రీస్తుకు శిలువ వేశారు. చేతుల్ని
శిలువకు మేకులతో బంధించారు. రక్తం ఓడుతున్న ఏసుక్రీస్తు మూడుగంటల తర్వాత
ప్రాణం వదిలాడు. ఆ రోజు శుక్రవారం... మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకు
ఏసుక్రీస్తు శిలువపై తుది శ్వాస విడిచాడు. ఆ నాటి ఆ శిలువకు గుర్తుగా..
చర్చిల్లో శిలువను ఉంచే సంప్రదాయం నెలకొంది. మరణించే ముందు ఏసుక్రీస్తు
దేవుణ్ణి ఇలా ప్రార్ధించాడు.

ప్రభూ నా మరణానికి కారణమైన వీళ్ళందరిని క్షమించు. వీరు పాపులే అయినా
క్షమించి వదిలిపెట్టు ఎందుకంటే పాపం అని తెలీని అమాయకులు వారు.
ఏసుక్రీస్తులోని దయాగుణం, క్షమం, ఔన్నత్యాలకు ఇది నిదర్శనం. అయితే ఇది
జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఏసుక్రీస్తు శిలువపై నుండి
పునర్జన్మించాడు. అందుకే ఆ రోజు ఆనందసందోహాల ఈస్టర్‌ ఆదివారం
జరుపుకుంటారు. గుడ్‌ఫ్రైడేనాడు జరుపుకునేవి అన్ని అంతకుముందు గురువారం
రాత్రి ప్రారంభం అవుతాయి. చివరి సప్పర్‌ తీసుకున్న తరువాత - వారు ఈస్టర్‌
వరకు ఉపవాసం ఉంటారు. కైస్తవులకు ఆరాధనా స్థలం - ప్రశాంతతకు ప్రతిరూపంగా,
అహ్లాదకర వాతావరణానికి ప్రతిబింబంగా నిలిచే చర్చి.

గుడ్ ఫ్రైడే రోజున ఏమేం చేస్తారు...!

గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు
ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత
క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ
సమయాన్నే "ఈస్ట్ వెడ్నెస్‌డే" నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే
రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు.

ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం
క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి
ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.

ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు
సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు
వినిపించి వారిచేతకూడా చదివిస్తారు.

ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ
సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి
క్రీస్తును స్మరించుకుంటారు.

దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే
సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.

కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక
సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా
చేస్తారు.

క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం,
ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మ్రోగవు.


ఏసు అమర వాక్యాలు

జీసస్‌ను శిలువ చేసేందుకు గుల్గుతా అనే పేరుగల ప్రాంతానికి
తీసుకువెళ్ళారు. అక్కడ ఆయనను శిలువకు వ్రేలడదీసారు. ఏసు యహూదీయులకు రాజు
అని ఓ ఉత్తరంలో పేర్కొనబడింది. మిట్టమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏసు తన
ప్రాణాలను పరలోకానికి పంపేముందు ఏడు అమర వాక్యాలు పలికారు. వాటిని ఈ రోజు
స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

మొదటి వాక్కు : ఓ తండ్రీ వీరిని క్షమించు, ఎందుకంటే వీరి ఏం చేస్తున్నారో
వీరికి తెలియదు.

రెండవ వాక్కు : ఈ రోజు నీవు నాతోబాటు స్వర్గలోకంలో ఉంటావని నేను
నమ్ముతున్నాను. దేవుడా నేను నీతో నిజమే పలుకుతున్నాను.

మూడవ వాక్కు : ఓ నారీమణి, నీ పుత్రుడ్ని, నీ తల్లిని చూడు.

నాలుగవ వాక్సు : ఓ నా పరమేశ్వరుడా..! ఓ నా పరమేశ్వరుడా..! నీవు నన్ను
ఎందుకు వదిలేసావు?

ఐదవ వాక్కు : నేను నీకోసం పరితపిస్తున్నాను.

ఆరవ వాక్కు : పూర్తయిపోయింది.

అందరికి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు తన పుత్రుడైన ఏసును ఏ
కార్యక్రమంకోసం భూమిమీదకు అవతరింపజేసాడు. ఆ పని ఇప్పుడు పూర్తయ్యింది.
చివరికి శైతానుకూడా ఆ పనులు పూర్తయ్యేందుకు అడ్డుపడలేకపోయాడు. శైతాను వలన
కాలేదు. కాని జీసస్ తన ప్రాణాలను వదిలి చేయవలసిన పనులేవైతే ఉన్నాయో
వాటిని పూర్తి చేసాడు. మనందరికి మంచి జీవితాన్ని ప్రసాదించి మనకంటూ
కొన్ని లక్ష్యాలను రూపొందించాడు దేవుడైన ఏసు ప్రభువు. వాటిని పొందడానికి
నిరంతరం ప్రయత్నిస్తుండాలి.

ఏడవ వాక్కు : ఓ నా తండ్రీ ! నేను నా ఆత్మను నీ చేతులలో ఉంచుతున్నాను.

దేవుడు తనకు చెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని ఏసు ప్రభువు ఈ
ప్రపంచాన్ని వదిలి పరలోకానికి పయనమైన రోజు ఈ రోజు. ఆ రోజులలో అపరాధులకు
కోరడాలతో శిక్షించేవారు. రెండవది బలిపీఠంపై వ్రేలాడదీసేవారు. ఏసు
క్రీస్తు ఈ రెండు శిక్షలను అనుభవించి తన తండ్రి అయిన దేవునికి తన ఆత్మను
సమర్పించి ప్రపంచంనుంచి కనుమరుగైనారు. అయినాకూడా ఆయన మన మధ్యలోనే
ఉన్నారు. ఓ నా తండ్రి ఇది ఆత్మీయతకు పరిచయ మార్గం.

శుభకరమైన శుక్రవారంనాడు పవిత్రమైన ఈ రోజున ప్రపంచశాంతి, ఉగ్రవాదం
అంతమవ్వాలని కోరుకుంటూ ఇరుగు పొరుగు అందరూ సోదర భావంతో మెలగాలని,
ఇతరులపట్ల ప్రేమానురాగాలను పంచాలనికోరుతూ ప్రార్థించండి.
హలలూయా....హలలూయా...హలలూయా...!



Good Friday is the Friday immediately preceding Easter Sunday. It is
celebrated traditionally as the day on which Jesus was crucified. If
you are interested in a study of the issue, please see our article
that discusses the various views on which day Jesus was crucified.
Assuming that Jesus was crucified and died on a Friday, should
Christians remember Jesus' death by celebrating Good Friday?

The Bible does not instruct Christians to remember Christ’s death by
honoring a certain day. The Bible does give us freedom in these
matters, however. Romans 14:5 tells us, “One man considers one day
more sacred than another; another man considers every day alike. Each
one should be fully convinced in his own mind.” Rather than
remembering Christ's death on a certain day, once a year, the Bible
instructs us to remember Christ’s death by observing the Lord’s
Supper. First Corinthians 11:24-26 declares, “...do this in
remembrance of me...for whenever you eat this bread and drink this
cup, you proclaim the Lord's death until he comes.”

Why is Good Friday referred to as “good”? What the Jewish authorities
and Romans did to Jesus was definitely not good (see Matthew chapters
26-27). However, the results of Christ’s death are very good! Romans
5:8, “But God demonstrates his own love for us in this: While we were
still sinners, Christ died for us.” First Peter 3:18 tells us, “For
Christ died for sins once for all, the righteous for the unrighteous,
to bring you to God. He was put to death in the body but made alive by
the Spirit.”

Many Christian churches celebrate Good Friday with a subdued service,
usually in the evening, in which Christ’s death is remembered with
solemn hymns, prayers of thanksgiving, a message centered on Christ
suffering for our sakes, and observance of the Lord's Supper. Whether
or not Christians choose to “celebrate” Good Friday, the events of
that day should be ever on our minds because the death of Christ on
the cross is the paramount event of the Christian faith.

If you would like to learn more about why Jesus' death on the cross
was so “good,” please read the following article: What does it mean to
accept Jesus as your personal Savior?                                                                             
                by DAVID KUMAR
good_friday
File Size: 18 kb
File Type: good friday
Download File